బురుజు.కాం Buruju.com : ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 16వ తేదీన విడుదల కానున్న అవతార్2 Avatar2 సినిమాలో.. టైటానిక్ కథానాయికి విన్స్లెట్ kate winslet ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. ‘పండోరా’ గ్రహంపైన కన్నేసిన భూ గ్రహ వాసులతో.. ఆమె తన జాతి వారి కోసం పోరాడుతుంది. టైటానిక్ సినిమాలో.. నౌక మునిగిపోయినప్పుడు ఒక చెక్కముక్క సాయంతో ప్రాణాలను దక్కించుకొనే పాత్రలో జీవించి.. కోట్లాది మందికి గుర్తుండిపోయిన ఆమె.. ఇప్పుడు మాత్రం పండోరా గ్రహ సముద్ర జలాల దిగువన 7 నిముషాల పాటు పోరాటం చేయనుండటం విశేషం. ప్రస్తుతం నడి వయస్సులో ఉన్న ఆమె నటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఆమెది పండోరా గ్రహ వాసుల కోసం పోరాడే పాత్ర
అవతార్ మొదటి భాగం 2009లో విడుదలయ్యి ప్రేక్షకుల నుంచి విశేషణ ఆధరణ లభించటంతో దాదాపుగా రూ.21 వేల కోట్లను రాబడిని కళ్లజూసింది. అవతార్2.. ఆ తర్వాత మరో మూడు భాగాలు కూడా రానున్నట్టుగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ప్రకటించారు. అవతార్ మొదటి భాగంలో తనను ప్రధాన పాత్రలో నటించాల్సిందిగా అడగ్గా తాను తిరస్కరించానంటూ హిందీ నటుడు గోవింద 2019లో వెల్లడించినప్పటి నుంచి.. రెండో భాగంలో బాలివుడ్ నటులు ఎవరైనా ఉంటారా? అనే చర్చ మొదలయ్యింది. బాలివుడ్ నటుల గురించి ఇంతవరకు సమాచారమేదీ లేకున్నప్పటికీ.. హాలీవుడ్ నటి విన్స్లెట్ నటించినట్టుగా ఇటీవల వెల్లడికావటంతో భారతీయుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం.. ప్రస్తుత అవతార్ డర్శకుడు జేమ్స్ కామెరూన్.. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన టైటానిక్ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించటమే. అప్పట్లో ఆమె విదేశస్తురాలు మాదిరిగా కాకుండా భారతీయురాలి మాదిరిగానే ఉండటంతో తెలుగు ప్రేక్షకులనూ ఆమె బాగా ఆకట్టుకోగలిగారు.
టైటానిక్ సినిమా చివరిలో కథానాయకుడు కథానాయికిని ఈ చెక్కపైకి ఎక్కించి తాను మాత్రం సముద్రంలో మునిగిపోతాడు. ఆసన్నివేశం, ఆ పాత్రాలు పాతికేళ్లయినా ఇంకా ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి
పండోరా అనే గ్రహంపై గల విలువైన ఖనిజం కోసం అక్కడి జీవుల మాదిరిగా ఉండేవారిని భూ గ్రహంపై తయారు చేసి పంపటం అవతార్ 1లోని కథ. ఆ జీవులు ‘పండోరా’కు వెళ్లిన తర్వాత అక్కడివారితో ఏకమయ్యి.. భూ గ్రహ ప్రాజెక్టుకు చెందిన సైన్యంతో తలపడుతుంటారు. ఇటువంటి క్రమంలో వస్తున్న రెండో భాగంలో.. పండోరాలోని సముద్రాల వద్ద పోరాటాలు ఉండనున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ తెలియజేస్తోంది.
విన్స్లెట్.. టైటానిక్ లో అలా.. అవతార్2లో ఇలా..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విన్స్లెట్ చెప్పిన దాని ప్రకారం.. ఆమె కొన్ని అతీంద్రీయ శక్తులు కలిగి మత్యకన్య జాతికి చెందిన యువతి పాత్రలో కనిపిస్తుంది. పండోరాపై దండెత్తి వచ్చిన వారితో తన జాతి కోసం, వారి మనుగడ కోసం పోరాడుతుంది. అవతార్2 ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో సహా 160 భాషల్లో విడుదల కానుంది.