‘లైర్ ’ సినిమాలో మాదిరిగా.. మరెన్నో రూపాల్లో జీవాయుధాలు
personBuruju Editor date_range2023-02-28
లైర్ సినిమాలోని జీవాయుధం, దానిని మట్టుపెట్టే సైనికులు
బురుజు.కాం Buruju.com : దేశాల మధ్య యుద్ధాలు మున్ముందు కొత్త రూపాలను సంతరించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం అణు బాంబులు ఉన్నాయంటూ దేశాలు ఒకదాన్ని మరొకటి బెదిరించుకొంటుండగా.. జీవాయుధాలు ఉన్నాయంటూ బెంబేలెత్తించే పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కావచ్చు. అటువంటి ఒక జీవాయుధాన్ని ఊహించి రూపొందించిన హాలీవుడ్ చిత్రం ‘లైర్ lair’ . సగం మనిషి, సగం గ్రహాంతర వాసి ఉండేలా రష్యా తయారు చేసిన భయంకర జీవాయుధాన్ని మట్టుపెట్టేందుకు కొందరు సైనికులు చేసే సాహసాలు మనకు ఉత్కంఠను కలిగించినప్పటికీ.. భవిష్యత్తు ముఖచిత్రం ప్రస్పుటమయ్యి భయం కూడా వేస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ లో వింత జీవిని మట్టుపెట్టేందుకు వెళ్తున్న సైనికులు
కరోనా వైరస్ కూడా జీవాయుధమే. దీన్ని చైనా తయారు చేస్తుండగా ల్యాబ్ నుంచి బయటకు వచ్చేసిందనే వాదనలను అమెరికాలోని ఎనర్జీ డిపార్టుమెంట్ నిపుణులు తాజాగా నిర్ధారించినట్టు అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల థియేటర్లలో విడుదలయ్యి, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉన్న లైర్ సినిమా.. ప్రేక్షకులను ఆలోచింపజేసే రీతిలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బ్రిటీష్ మహిళా పైలెట్ కు పాత బంకరు ఒకటి కనిపిస్తుంది. ఆమె దాని లోపలకు వెళ్లి చూడగా మనిషి,మృగం రెంటినీ పోలివుండే వింత జీవులు పైకి లేస్తాయి. రష్యా సారధ్యంలో దాదాపు 30 ఏళ్ల క్రితం వరకు కొన్ని దేశాలు కలిసి యు.ఎస్.ఎస్.ఆర్ గా ఉన్నప్పుడు వాటిని తయారు చేసినట్టుగా వెల్లడవుతుంది. అవి మనషుల్ని తినేస్తుంటాయి. వాటిని మట్టుపెట్టే క్రమంలో పలువురు సైనికులు ప్రాణాలను కోల్పోతారు.
వింత జీవి దాడి చేస్తున్న సన్నివేశం
అంతరిక్షం నుంచి పడిన గ్రహ సకలంలోని ఒక జీవి డీఎన్ఏను, మనిషి డీఎన్ఏను కలిపి ఈ జీవాయుధాన్ని తయారు చేసినట్టుగా దర్శకుడు ఊహించి సినిమాను తీసినప్పటికీ.. కరోనా వైరస్ తయారీకి చైనా అనుసరించిన పద్దతులను తెలుసుకొన్న తర్వాత దేశాలు జీవాయుధాల కోసం కొత్తకొత్త పోకడలకు తెరతీస్తాయనే భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి దివాళా అంచున ఉన్న పాకిస్థాన్ తో మనకు ఉగ్రవాదుల ముప్పే తప్ప నేరుగా యుద్ధం చేయాల్సిన పరిస్థితేమీ రాబోదు. ఇక మనకు పక్కలో బల్లెంగా ఉన్నది చైనా మాత్రమే. చైనాను ఎదుర్కొనటానికి మనం జీవాయుధాలను కాకపోయినా కొంగ్రొత్త ఆయుధాలకు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది.