కేసీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించిన సెర్ప్ ఉద్యోగులు
personBuruju Editor date_range2023-02-16
నిజామాబాద్ జిల్లా భీంగల్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులు కుంట గంగాధర్ రెడ్డి తదితరులు
బురుజు.కాం Buruju.com : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్రంలోని పేదిరక నిర్మూలన సంస్థ ( సెర్ప్) ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. పే స్కేళ్లను వర్తింప జేసేందుకు తాజా బడ్జెట్టులో రూ.56 కోట్లను కేటాయించటంతో.. అందుకు కృతజ్ఞతగా ఫిబ్రవరి 17వ తేదీన పలు చోట్ల వీరు సీఎం జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భీంగల్ లో ..
నిజామాబాద్ జిల్లా భీంగల్ సెర్ప్ ఉద్యోగులు మిగతా చోట్లకు భిన్నంగా అక్కడి శుభోదయం పాఠశాలలోని మానసిక దివ్యాంగుల నడుమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి వారి ప్రశంసలు అందుకొన్నారు. సెర్ప్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) అధ్యక్షులు కుంట గంగాధర్ రెడ్డి, భీంగల్ ఏపీఎం కుంట శ్రీనివాస్ తదితరులు ఇక్కడి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా తయారు చేయించిన కేక్ ను దివ్యాంగులతో కట్ చేయించి ,అనంతరం వారికి భోజనాన్ని పెట్టి పండ్లనూ అందజేశారు. ఇక్కడి కార్యక్రమానికి ఇంకా.. సెర్ప్ సీసీలు వర్ణం శ్రీనివాస్, నరేష్, రఘుపతి, సుమలత, భాస్కర్, గంగాధర్, గంగ, లలిత, మండల సమాఖ్య సిబ్బంది ముత్యం గణేష్, అరుణ తదితరులు హాజరయ్యారు. సీఎం పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోను సెర్ప్ సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించినట్టు జేఏసీ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి తెలిపారు. పేస్కేళ్లను వర్తింప చేయనుండటంతో తామంతా సంతోషంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
నల్గొండ జల్లా నకిరేకల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సెర్ప్ ఉద్యోగుల సీసీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సయ్య తదితరులు
మహమూబ్ నగర్ జిల్లాలోని వేడుకల్లో.. సెర్ప్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్