Buruju News logo
  • News

  • About Us

  • Contact Us

  • Search

  • Twitter

ప్రధాని మోది కొనియాడిన రామాయణ ‘ఉడత’ తెలంగాణలో పుట్టింది !
personBuruju Editor date_range2024-01-23
{{resdata.image_caption1} లంకకు వారథి నిర్మాణం.. రాముని చేతిలో ఉడత ఊహా చిత్రం (2) అయోధ్యలో బాలక్ రాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామాయణంలోని ఉడత పాత్ర గురించి వివరిస్తున్న ప్రధాన మంత్రి మోదీ

బురుజు.కాం Buruju.com : Hyderabad: లంకకు వారథిని నిర్మించేటప్పుడు ఒక ఉడత కూడ ఇసుక రేణువులను, చిన్నపాటి రాళ్లను మోస్తూ రాముడిపై తనకు గల భక్తిని చాటుకొంది. అయోధ్య ఆలయంలో బాలక్ రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు అనంతరం ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ.. రామాయణంలోని ఉడతతో సహా నాలుగు పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించి వాటికి మల్లే ప్రతి ఒక్కరు తమ శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా దేశానికి సాయపడాలని ఉద్భోదించారు. ఆయన చాలా వర్ణిస్తూ చెప్పిన ‘ఉడత’ పాత్రను రామాయణంలోకి జొప్పించింది తెలుగు కవి గోన బుద్ద రాజు. వాల్మీకి రాసిన మూల రామాయణంలో ఉడత ప్రసక్తి లేనేలేదని చరిత్రకారులు, కవి ఆరుద్ర 35 ఏళ్ల క్రితం తేల్చిచెప్పారు. కేవలం 680 ఏళ్ల క్రితం తెలుగు కవి రాసిన ఉడతా భక్తిని వాల్మీకి రామాయణంలోని అంశంగా మోదీతో సహా రామభక్తులంతా విశ్వసించటం తెలుగు వారంతా గర్వపడే విషయం. దీనిపై Buruju.com అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

1) రంగనాథ రామాయణాన్ని రాసిన గోన బుద్ధ రాజు ఊహా చిత్రం.  ఈయన్ని    బుద్ధ రాజు అని ఆరుద్ర పేర్కొనగా గోన గన్నా రెడ్డి మనవుడు కనుక గోన బుద్ధా రెడ్డిగాను వ్యవహారంలో ఉన్నారు (2) గోన బుద్దరాజు రాసిన రంగనాథ రామాయాన్ని తెలుగు అకాడమి కూడా ముద్రించింది 1) రంగనాథ రామాయణాన్ని రాసిన గోన బుద్ధ రాజు ఊహా చిత్రం. ఈయన్ని బుద్ధ రాజు అని ఆరుద్ర పేర్కొనగా గోన గన్నా రెడ్డి మనవుడు కనుక గోన బుద్ధా రెడ్డిగాను వ్యవహారంలో ఉన్నారు (2) గోన బుద్దరాజు రాసిన రంగనాథ రామాయాన్ని తెలుగు అకాడమి కూడా ముద్రించింది

రామాయణ సంఘటనలు ఇప్పటికి 4,500 సంవత్సరాల క్రితం చోటు చేసుకొన్నట్టుగా ప్రఖ్యాత చరిత్రకారులు సురవరం ప్రతాప రెడ్డి తన ‘రామాయణ విశేషములు’ గ్రంథంలో విశ్లేషించారు. రామాయణాన్ని తొలుత వాల్మీకి రాసిన తర్వాత పలువురు దానిని తమదైన శైలిలో తిరగరాస్తూ కొన్ని కొత్త అంశాలను కూడా జోడిస్తూ వచ్చారు. అలా తెలంగాణకు చెందిన గోన బుద్ధ రాజు ( Gona Buddha Reddy ) అనే ప్రభువు ఇప్పటికి 680 సంవత్సరాల క్రితం ‘రంగనాథ రామాయణం’ రాసి దానిలో వాల్మీకి రాయని లక్ష్మణ రేఖ, ఉడత సాయం సంఘటనలను చేర్చారు. రాణి రుద్రమదేవికి చేదోడువాదోడుగా ఉంటూ తెలంగాణలో వర్ధమానపురం సామంత రాజుగా ఉన్న గోన గన్నారెడ్డి మనవడే గోన బుద్ధరాజు. ఆయన రాసిన రామాయణం విశేషంగా ప్రాచుర్యం పొందింది.

(1) ప్రఖ్యాత కవి, చరిత్రకారులు ఆరుద్ర (2) ఆయన రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి భాగం గ్రంథం.  ఉడత ఉదంతం రంగనాథ రామాయణంలో మాత్రమే ఉన్నట్టుగా ఇదే గ్రంథంలో ఆయన వెల్లడించారు (1) ప్రఖ్యాత కవి, చరిత్రకారులు ఆరుద్ర (2) ఆయన రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి భాగం గ్రంథం. ఉడత ఉదంతం రంగనాథ రామాయణంలో మాత్రమే ఉన్నట్టుగా ఇదే గ్రంథంలో ఆయన వెల్లడించారు

కొందరు రచయితలు రాసిన రామాయణాలను వాల్మీకి రామాయణంతో ఆరుద్ర Arudra సరిపోల్చి వాటిలోని తేడాలను 1988లో ప్రచురించిన తన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ మొదటి భాగంలో వెల్లడించారు. వాల్మీకి రామాయణం మూలంలో లేని ఉడత ఘట్టాన్ని మొదటి సారిగా గ్రంథస్తం చేసింది గోన బద్ధరాజు అని ఆయన స్పష్టం చేశారు. పాడుకోవటానికి వీలైన ద్విపద చందస్సులో ఈయన రామకథను చెప్పాడని, దీనిని క్రీ.శ 1340 ప్రాంతంలో రాసి ఉండొచ్చని కొన్ని చారిత్రక ఆధారాలతో ఆరుద్ర అంచనా వేశారు. ‘‘ చిత్త శుద్ధితో, ప్రేమతో చేసిన ఎటువంటి సేవనైనా తెలుగు వాళ్లం ‘ఉడతా భక్తి’ అంటాం. ఇది తెలుగు జాతీయం. సేతువు కడుతున్నప్పుడు రాముల వారికి తోడ్పడిన ఉడత పూర్తిగా తెనుగుదే’’ అని ఆరుద్ర పేర్కొన్నారు.

రాముడి చేతిలో ఉడత రాముడి చేతిలో ఉడత

రామాయణంలోని శబరి, గుహుడు, ఉడత, జటాయువు పాత్రలు అందరికీ ఆదర్శ ప్రాయమైనవని ప్రధాన మంత్రి మోదీ Prime Minister Modi .. జనవరి 22వ తేదీన అయోధ్యలో Ayodhya బాలక్ రాముడి Baalak Ram విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువు అనంతరం తన ప్రసంగంలో పేర్కొన్నారు. వానర సైన్యం లంకకు బండ రాళ్లతో వారథిని నిర్మిస్తున్నప్పుడు ఉడత తనవంతుగా చిన్నచిన్న రాళ్లను నోట కరచి వాటి మధ్యలో వేసిందని, ఉడత సాయాన్ని వానరాలు వెక్కిరించగా దశరథ నందుడు మాత్రం ముగ్ధుడయ్యాడని పేర్కొన్నారు. ‘‘ బలవంతుడు, బలహీనుడు అని కాకుండా చేస్తున్న సాయాన్ని మాత్రమే చూడాలని వానరాలకు రాముడు ఉపదేశించాడు. ఉడత వెన్నును తన చేతితో నిమిరాడు. ఆ స్పర్శతోనే ఉడత వీపు భాగంలో చారలు ఏర్పడ్డాయని చెబుతుంటారు. ఈ కథను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలి. నాతో ఏమవుతుందిలే అనే భావనను విడనాడి ఉడతను చూసి నేర్చుకోవాలి. చిన్నదా, పెద్దదా అని కాకుండా భారత్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తన వంతుగా ఏం చేయగలమో అది చేయాలి’’ అని మోదీ ఉద్భోదించారు. ప్రదాని మోదీ చెప్పిన ఉడత విషయాలను అయోధ్యకు వచ్చిన ప్రముఖులు, సామాజిక మాధ్యమాల ద్వారా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తిలకించిన ప్రజలు శ్రద్ధగా విన్నారు. తెలుగు కవి గోన బుద్దరాజు (గోన బుద్ధా రెడ్డి) మరో సారి ధన్యుడయ్యాడు.

Tags:చలన చిత్రంStory

Recent Posts:

అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను  కాపాడిన  తెలుగు అధికారి
అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను కాపాడిన తెలుగు అధికారి
బురుజు.కాం Buruju.com భారత్ లో రాకెట్ ప్రయోగాలకు భీజం వేసింది.. ఇస్రో శాస్త...
చలన చిత్రం
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు?  ( అయిదో భాగం)
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు? ( అయిదో భాగం)
బురుజు.కాం Buruju.com : ( అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొ...
చారిత్రకం
మూడు పార్టీలకు  చెమటలు పట్టించనున్న మునుగోడు
మూడు పార్టీలకు చెమటలు పట్టించనున్న మునుగోడు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో త్వరలోనే మళ్లీ ఎన్నికల వేడి రాజకోబోతోంది...
అవీ ఇవీ
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత లక్ష్యం మారిపోతోంద...
సామాజికం
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
బురుజు.కాం Buruju.com : జాతీయ ప్రణాళిక సంఘం రద్దయినప్పటి నుంచి రాష్ట్రాల ...
ఆర్థికం
గవర్నరు  ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
గవర్నరు ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
బురుజు.కాం Buruju.com : ఎవరైనా కలత చెందుతున్నప్పుడు వారిని అర్ధం చేసుకొన...
అవీ ఇవీ
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
బురుజు.కాం Buruju.com : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు రాష్ట్రాలుగా వ...
అవీ ఇవీ
తెలంగాణలో వరద రాజకీయం
తెలంగాణలో వరద రాజకీయం
బురుజు.కాం Buruju.com : రాష్ట్రాల్లో వరదలు, తుపానులు ఎప్పుడొచ్చినా రాజకీయాల...
అవీ ఇవీ
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
బురుజు.కాం Buruju.com : వ్యభిచారాన్నీ ఒక వృత్తిగా గుర్తించి తమను ఇతరులతో స...
చలన చిత్రం
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
(పిళ్లా సాయికుమార్: Buruju.com) ( విజయనగరంలో 1988లో మృతి చెందిన నిజాయితీ ...
రిపోర్టర్ డైరీ
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
బురుజు.కాం ( Buruju.com) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇక బ్యాంకింగ్ సేవల...
ఆర్థికం
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
బురుజు.కాం Buruju.com : సామాన్యుడికి అండగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పి ...
చలన చిత్రం
అల్లూరిని హతమార్చిన  పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ?  (నాలుగో భాగం)
అల్లూరిని హతమార్చిన పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ? (నాలుగో భాగం)
బురుజు.కాం Buruju.co ప్రతినిధి: (అల్లూరి సీతారామరాజు తమ అధీనం నుంచి తప్ప...
చారిత్రకం
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
సగటు ఆయుర్దాయం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు వెల్లడయ...
అవీ ఇవీ
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
బురుజు.కాం ప్రతినిధి Buruju.com : ఒోవర్ డ్రాఫ్టు కింద రిజర్వు బ్యాంకు నుం...
ఆర్థికం
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
బురుజు.కాం Buruju.com : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చ...
చలన చిత్రం
About

Buruju.com, the online telugu portal brings you weekly news and views mainly focusing on Social, Financial and Historical events of Andhra Pradesh and Telagana states from Hyderabad, India.

Contact
For Editorial feedback and Marketing Contact:
editor@buruju.com
Quick Links
  • About Us
  • Contact Us
  • Search Buruju

Copyright © 2020 All Rights Reserved by Buruju. Contents of ‘Buruju.com’ are copyright protected. Copy or reproduction or re use of contents or any part thereof is illegal. Such persons will be prosecuted.