జీవిత కాలం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో 6 నెలలు ఎక్కువ !
personBuruju Editor date_rangeWed Nov 22 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుదలతో వయోధికులూ ఎక్కవవుతున్నారు
బురుజు.కాం Buruju.com : సగటు జీవిత కాలం Life Expectancy ఇప్పుడు తెలంగాణలో 70 ఏళ్లు, ఆంధ్రప్రదేశ్ లో 70 ఏళ్ల ఆరు నెలలుగా నమోదయ్యింది. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలలు ఎక్కువగా జీవించేందుకు వీలవుతోంది. రాష్ట్రాల వారీగా సగటు జీవిత కాలాలను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) తాజాగా వెల్లడించింది. కేంద్ర జనాభా గణాంకాల శాఖ తదితరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా వీటిని విశ్లేషించింది.
ఇటువంటి తోడుంటే ఆయుర్దాయం తప్పక పెరుగుతుంది
ఆరోగ్యంపై అవగాహన , అదే సమయంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటం వంటి కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మనిషి ఆయుర్దాయం క్రమేణా పెరుగుతోంది. మన దేశంలో 1970-75 మధ్య జీవించిన వారి సగటు కాలం కేవలం 49.7 సంవత్సరాలు. అదిప్పుడు జాతీయ స్తాయిలో 70.8 ఏళ్లకు చేరింది. అంటే 45 ఏళ్లలో 20 ఏళ్ల మేర ఎగబాకింది.
వైద్య సేవలు అందుబాటులోకి వస్తే.. జీవితకాలం మరింత మెరుగవుతుంది
తెలుగు రాష్ట్రాలను తీసుకొంటే.. 2014-18 మధ్యన ఏపీలో 70 ఏళ్లు, తెలంగాణలో 69.6 ఏళ్లు సగటు ఉండేవి. ఆర్బీఐ తాజా వివరాల ప్రకారం ఏపీలో ఇప్పుడు 70.6 కు చేరినందున ఈ వ్యవధిలో 6 నెలలు పెరిగిట్లయ్యింది. తెలంగాణలో ఆయుర్ధాయం 69.6 నుంచి 70 ఏళ్లకు చేరినందున ఇక్కడ నాలుగు నెలలు పెరిగింది. ఇటీవల కాలంలో కాలుష్యం ఎక్కువైనట్టుగా తీవ్ర ఆందోళలనలు వ్యక్తమవుతున్న దేశ రాజధాని దిల్లీలో మాత్రం ఆయుర్ధాయం మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 75.8 సంవత్సరాలుగా నమొదయ్యింది. దిల్లీ తర్వాత స్థానంలో కేరళ నిలిచింది. ఇక్కడ సగటు జీవిత కాలం 75 సంవత్సరాలు. దేశంలోని తొమ్మిది రాష్ట్రల్లోని సగటు 70 ఏళ్లు , అంతకు మించి ఉంది.