Buruju News logo
  • News

  • About Us

  • Contact Us

  • Search

  • Twitter

మీ ముందటి తరాల వారి జీవిత కాలాన్ని ఇలా తెలుసుకోండి!
personBuruju Editor date_rangeMon Feb 05 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
{{resdata.image_caption1} ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మంగారి గృహం

బురుజు.కాం Buruju.com : Hyderabad: రాంబాబు ఇంటిలో అతని తాత రాసి పెట్టిన వంశ వృక్షం ఇటీవల బయటపడింది. దానిలో ఏకంగా రాంబాబుకు ముందటి తొమ్మిది తరాల వారి పేర్లు ఉన్నాయి. అతని తండ్రి పుట్టిన సంవత్సరం తప్ప మిగతా ముందటి తరాల వారు జీవించిన కాలాలు మాత్రం దానిలో లేవు. తన తండ్రికి ముందటి తరాల వారు సుమారుగా ఏయే సంవత్సరాల్లో జీవించి ఉండొచ్చో తెలుసుకోవాలనే జిజ్ఞాస రాంబాబులో నెలకొంది. ఇటీవల ఆయన చరిత్ర పరిశోధకులను సంప్రదిస్తే వారు ఒక సూత్రీకరణను చెప్పారు. దాని ప్రకారం.. రాంబాబుకు ముందటి తొమ్మిదో తరం ముత్తాత జీవించిన కాలం దాదాపుగా 1724 వ సంవత్సరం. అప్పటికి బ్రిటీష్ వారు తెలుగు ప్రాంతాల్లో వ్యాపారం చేసుకొంటున్నారే తప్ప పాలన పగ్గాలను మాత్రం చేపట్టలేదు. ఆసక్తిని కలిగించే ఇటువంటి సూత్రీకరణను ప్రఖ్యాత రచయిత ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం ’ గ్రంథంలోను వెల్లడించారు. ఇది Buruju.com పాఠకులకు తప్పక ఆసక్తిని కలిగిస్తుంది.

ప్రఖ్యాత నటులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వంశవృక్షం ఇది ప్రఖ్యాత నటులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వంశవృక్షం ఇది

రాజుల కాలాలను అంచనా వేసేందుకు చరిత్ర పరిశోధకులు ఒక్కో తరానికి 30 సంవత్సరాల చొప్పున లెక్కిస్తారు. ఇలా రాంబాబుతో సహా పది తరాలకు తరానికి 30 ఏళ్ల చొప్పున పరిగణనలోకి తీసుకుంటే అది 300 ఏళ్లు ( 10x30=300) అవుతుంది. దానిని ప్రస్తుత 2024 నుంచి తీసివేస్తే 1724 వస్తుంది. ఇటువంటి లెక్కతోనే ప్రఖ్యాత పోతులూరి వీరబ్రహ్మం గారు జీవ సమాధి అయిన సంవత్సరాన్ని ఆరుద్ర తన ‘ సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మూడో సంపుటిలో అంచనా వేశారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి విగ్రహం పోతులూరి వీరబ్రహ్మంగారి విగ్రహం

కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మంగారికి అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వీర నారాయణమ్మ మనుమడి మనుమడు పేరు వెంకటేశ్వర స్వామి. ఆయన 1932లో చనిపోయారు. బ్రహ్మంగారికి ఇతను ఆరో తరం వాడు. తరానికి 30 ఏళ్ల కొలమానం ప్రకారం ఆరుద్ర లెక్కలు వేశారు. ‘‘ దీని ప్రకారం బ్రహ్మంగారు సమాధి అయిన సంవత్సరం క్రీ.శ.1752 కావచ్చు.. లేదా మరో తరం వరకు కూడా ఆయన జీవించి ఉండొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. కుంఫణి (బ్రిటీష్) ప్రారంభ దినాల్లో బ్రహ్మంగారు బతికే ఉన్నారని, తత్వాలను రాశారని భావించవచ్చని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన ఆధారాలంటూ లేకపోవటంతో బ్రహ్మంగారి జనన, మరణ సంవత్సరాలపై రకరకాల వాదనలు ఉన్నాయి. ఆయన జీవ సమాధి పొందింది క్రీ.శ. 1693గా కడప జిల్లాలో ఆయన నివసించిన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో ఇటీవల రాసినప్పటికీ చరిత్ర పరిశోధకుల కొలమానాన్ని బట్టి చూస్తే అది సరైన సంవత్సరం కానే కాదు. తాను పేర్కొన్న లెక్కతో బ్రహ్మంగారి కాల నిర్ణయం చాలా సులభంగానే తేలుతుందని ఆరుద్ర కితాబు కూడా ఇచ్చారు.

తరానికి 30 ఏళ్ల చొప్పున అంచనా వేసుకొని ఆయా కాలాల్లోని పరిస్థితులను కనుక శోధిస్తే ఆయా వంశాలకు చెందిన పూర్వపు చరిత్ర సైతం వెల్లడయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒక్కో సారి ఆశ్చర్యపర్చే సంగతులూ బహిర్గతం కావచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం తర్వాత వంశ వృక్షాలను రాయటం క్రమేణా అంతరించిపోతోంది. ఇటువంటి సంస్కృతిని ఉభయ తెలుగు రాష్ట్రాల వారు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే భవిష్యత్తు తరాల వారికి ఇప్పటి తరాల వారి విషయాలు అవగతమవుతాయి ( ఈ లింకును దయచేసి మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి)

Tags:చలన చిత్రంStory

Recent Posts:

అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను  కాపాడిన  తెలుగు అధికారి
అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను కాపాడిన తెలుగు అధికారి
బురుజు.కాం Buruju.com భారత్ లో రాకెట్ ప్రయోగాలకు భీజం వేసింది.. ఇస్రో శాస్త...
చలన చిత్రం
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు?  ( అయిదో భాగం)
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు? ( అయిదో భాగం)
బురుజు.కాం Buruju.com : ( అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొ...
చారిత్రకం
మూడు పార్టీలకు  చెమటలు పట్టించనున్న మునుగోడు
మూడు పార్టీలకు చెమటలు పట్టించనున్న మునుగోడు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో త్వరలోనే మళ్లీ ఎన్నికల వేడి రాజకోబోతోంది...
అవీ ఇవీ
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత లక్ష్యం మారిపోతోంద...
సామాజికం
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
బురుజు.కాం Buruju.com : జాతీయ ప్రణాళిక సంఘం రద్దయినప్పటి నుంచి రాష్ట్రాల ...
ఆర్థికం
గవర్నరు  ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
గవర్నరు ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
బురుజు.కాం Buruju.com : ఎవరైనా కలత చెందుతున్నప్పుడు వారిని అర్ధం చేసుకొన...
అవీ ఇవీ
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
బురుజు.కాం Buruju.com : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు రాష్ట్రాలుగా వ...
అవీ ఇవీ
తెలంగాణలో వరద రాజకీయం
తెలంగాణలో వరద రాజకీయం
బురుజు.కాం Buruju.com : రాష్ట్రాల్లో వరదలు, తుపానులు ఎప్పుడొచ్చినా రాజకీయాల...
అవీ ఇవీ
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
బురుజు.కాం Buruju.com : వ్యభిచారాన్నీ ఒక వృత్తిగా గుర్తించి తమను ఇతరులతో స...
చలన చిత్రం
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
(పిళ్లా సాయికుమార్: Buruju.com) ( విజయనగరంలో 1988లో మృతి చెందిన నిజాయితీ ...
రిపోర్టర్ డైరీ
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
బురుజు.కాం ( Buruju.com) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇక బ్యాంకింగ్ సేవల...
ఆర్థికం
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
బురుజు.కాం Buruju.com : సామాన్యుడికి అండగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పి ...
చలన చిత్రం
అల్లూరిని హతమార్చిన  పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ?  (నాలుగో భాగం)
అల్లూరిని హతమార్చిన పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ? (నాలుగో భాగం)
బురుజు.కాం Buruju.co ప్రతినిధి: (అల్లూరి సీతారామరాజు తమ అధీనం నుంచి తప్ప...
చారిత్రకం
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
సగటు ఆయుర్దాయం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు వెల్లడయ...
అవీ ఇవీ
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
బురుజు.కాం ప్రతినిధి Buruju.com : ఒోవర్ డ్రాఫ్టు కింద రిజర్వు బ్యాంకు నుం...
ఆర్థికం
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
బురుజు.కాం Buruju.com : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చ...
చలన చిత్రం
About

Buruju.com, the online telugu portal brings you weekly news and views mainly focusing on Social, Financial and Historical events of Andhra Pradesh and Telagana states from Hyderabad, India.

Contact
For Editorial feedback and Marketing Contact:
editor@buruju.com
Quick Links
  • About Us
  • Contact Us
  • Search Buruju

Copyright © 2020 All Rights Reserved by Buruju. Contents of ‘Buruju.com’ are copyright protected. Copy or reproduction or re use of contents or any part thereof is illegal. Such persons will be prosecuted.