అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఔరంగజేబుపై తిరగబడే ‘ హరిహర వీరమల్లు’
personBuruju Editor date_range2023-09-06
వీరమల్లు పాత్రధారి పవన్ కల్యాణ్
బురుజు.కాం Buruju.com : Hyderabad; మొగలుల అరాచకాలను ప్రతిఘటించే యోధుడుగా పవన్ కల్యాణ్ Pavan Kalyan నటిస్తున్న ‘ హరి హర వీరమల్లు’ తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల సమయానికి విడుదల కానుంది. సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. యుద్ధ సన్నివేశాలు తదితరాలకు సబంధించిన గ్రాఫిక్ పనులను పెద్ద ఎత్తున చేపట్టాల్సివున్నట్టు సమాచారం. సినిమా చిత్రీకరణ మొదలయ్యి ఇప్పటికే ఏడాది పైగా అయ్యింది. పవన్ రాజకీయంగాను బిజీగా ఉంటుండటంతో షూటింగు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. మొగలులు 17వ శతాబ్ధంలో దేశ వ్యాప్తంగా పలు రాజ్యాలను కబళించి.. నాటి కోటల్లోని సిరి సంపదలను కొల్లగొట్టినట్టుగా చరిత్ర పుటల్లో లిఖించి ఉంది.
ఇది గెరిల్లా పోరాట యోధుడి రూపమే
మొగల్ చక్రవరి ఔరంగజేబు అరాచకాలకు గోల్కొండ పరిసరాలే ప్రభల నిదర్శనం. ఆయన 1687లో గోల్కొండ Golkonda కోటను స్వయంగా ముట్టడించి, ఏడు కోట్లకు పైగా ధనం, అపారమైన సువర్ణ, వజ్ర, వైడూర్య రాశులను కొల్లగొట్టినట్టు చరిత్ర చెబుతోంది. మొగలులను దేశంలో దక్షినాది కంటే ఉత్తరాదిలో శివాజి తదితరులు గట్టిగా ఎదుర్కొన్నందున.. నాటి గాథలను ఇప్పటికీ అక్కడి ప్రజలు చెప్పుకొంటూ ఉంటారు. హరిహర వీరమల్లు.. Hari Hara Veeramallu ఉత్తరాదిలో మరింత ఆదరణ పొందటం తధ్యమని, ఇది పాన్ ఇండియా చిత్రమని నిర్మాత ఏఎం రత్నం గట్టిగా చెప్పటానికి కారణం ఇదే కావచ్చు.రాచరిక వ్యవస్థలో పాలకుల అరాచకాలను ఎదుర్కొనాలంటే రహస్య జీవితం గడుపుతూ.. సేనలపై అకస్మాత్తుగా గెరిల్లా తరహా పద్దతుల్లో విరుచుకుపడాల్సివుంటుంది.. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ వస్త్ర ధారణ చూస్తుంటే.. ఇలా గెరిల్లా పద్దతుల్లో పోరాడే సాహస వీరుడిగా నటించినట్టు స్పష్టమవుతోంది. అందువల్లనే.. వీరమల్లును.. ‘సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే ఒక అందమైన కల వంటి చిత్రం’గా మాటల రచయిత బొర్రా వేణుమాధవ్ పేర్కొన్నారు.
సినిమా చిత్రీకరణ సమయంలోని సన్నివేశాలు
దర్శకుడు జాగర్లమూడి క్రిష్.. హిందీలో ‘మణికర్ణిక’ సినిమాను తీస్తున్న సమయంలోనే వీరమల్లు కథను తనకు చెప్పారని, వెంటనే తాను అంగీకరించానని నిర్మాత ఏఎం రత్నం AM Ratnam ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా 2023, సెప్టెంబరు నెలలో ఆయన వేరే సినిమాకు సంబంధించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరిహర వీరమల్లును వచ్చే ఏడాది ఎన్నికలకు ముందుగా విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. షూటింగు 2023 చివరి నాటికి పూర్తవుతుందన్నారు. సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్.. కొంత కాలం క్రితం ఒక చోట సూచాయగా చెప్పిన దాని ప్రకారమైతే 17వ శతాబ్ధంతో పాటు ప్రస్తుత కాలానికి సబంధించి కూడా కథ ఉంటుంది. సినిమాలో ఔరంగ జేబుగా హిందీ నటుడు బాబి డియోల్ నటిస్తున్నారు.
‘వీరమల్లుడు సాహసాలు’ పేరుతో 50 ఏళ్ల క్రితం శీతంరాజు అనే ఆయన రాసిన బాలల నవల ముఖచిత్రం
వీరమల్లు కల్పిత పాత్రే అయినప్పటికీ.. ఆ పేరుతో ఒకప్పుడు ‘చందమామ’ మాస పత్రికలో అనేక కథలు వస్తుండేవి. వ్యక్తులకు వీరమల్లు అనే పేరు ఉండేది.తెలుగులో 50 ఏళ్ల క్రితం ‘ వీరమల్లుడు సాహసాలు’ అనే బాలల నవల ఒకటి వెలువడింది. దీనిని శీతం రాజు అనే ఆయన రాశారు. నవలలోని అంశం రాజులనాటి పాలనలోని అరాచకాలను ఎత్తిచూపటంగానే ఉంటుంది. వీరమల్లు అనేది తెలుగు నేలపై కొందరికి ఇంటిపేరుగాను ఉండటం విశేషం.